ఆలయంలో MLA ప్రత్యేక పూజలు
NZB: జిల్లా కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు సుహాస్ అభిషేకం, హారతి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈవో రవీందర్, ఛైర్మన్ ఆయనను శేష వస్త్రంతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.