'రామభక్త హనుమ మహా శక్తిమంతుడు'

'రామభక్త హనుమ మహా శక్తిమంతుడు'

ఏలూరు: రామాయణ మహాకావ్యంలో రత్నం వంటి మహా భక్తుడైన హనుమ అపార శక్తిమంతుడని ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రవచనకర్త జటావల్ల జగన్నాధం అన్నారు. కైకరం తూర్పు వీధిలో సుందర సీతారామస్వామి కళింగ రామాలయంలో జరుగుతున్న 11 రోజుల ప్రవచనాలు సోమవారం రాత్రి 10వ రోజుకు చేరాయి. సుందరకాండలో హనుమ చూపిన పరాక్రమం ప్రదర్శించిన వాక్పటిమ విశేషమైనవని జగన్నాధం అన్నారు.