బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు ఖాయం

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు ఖాయమని తిరుమలనాథ స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఆకుల మహేష్ అన్నారు. గురువారం మండలంలోని చల్మెడ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రాగుల బాబు,నేతలు కిష్ట గౌడ్ తదితరులు ఉన్నారు.