ఆరుగురు విద్యార్థులు మృతి చెందడం బాధాకరం: ఎంపీ

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలిలో నీటి కుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఎంపీ బస్తిపాటి నాగరాజు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో భాగంగా ఢిల్లీలో ఉన్న ఆయన.. ఫోన్ ద్వారా ఘటనకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.