బీటీ రోడ్డు మంజూరుకు వినతి

బీటీ రోడ్డు మంజూరుకు వినతి

NRPT: ధన్వాడ మండలంలోని గుడిగండ్ల నుంచి మంత్రోనిపల్లి, గున్ముక్ల గ్రామాలకు బీటీ రోడ్డు మంజూరు చేయాలని కోరుతూ ఇరు గ్రామాల సర్పంచులు రవికుమార్, శ్రీనివాస్ గౌడ్ మంత్రి వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారు వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినట్లు సర్పంచులు తెలిపారు.