నేడు బ్యాంకుల్లో సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం
NTR: జిల్లా పోలీస్‌శాఖ సైబర్ మోసాలపై 'సైబర్ సురక్ష' అనే పేరుతో ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా CP రాజశేఖరబాబు మాట్లాడుతూ.. సైబర్ మోసాలపై బ్యాంకుల్లో సిబ్బంది సాయంతో అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. నేడు విజయవాడ నగరంలోని 227 బ్యాంకు శాఖల్లో ఈ కార్యక్రమం చేపడతామన్నారు.