పిడుగుపడి యువకుడు మృతి

పిడుగుపడి యువకుడు మృతి

TPT: వెంకటగిరి మండలం యాతలూరులో శనివారం విషాదం నెలకొంది. స్థానిక ఎస్టీ కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు పొలం పనులకు వెళ్లారు. ఈక్రమంలో పిడుగు పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మరొకరు గాయపడటంతో వెంకటగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు రెడ్డిపల్లె మహేశ్ (24)గా గుర్తించారు.