టీడీపీ జిల్లా అధ్యక్షులను కలిసిన కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్

ATP: రాష్ట్ర ప్రభుత్వ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సుదర్శన్ నాయుడు శుక్రవారం టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా పుష్ప గుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి సన్మానించారు. వీరితోపాటు టీడీపీ నాయకులు ఆదినారాయణ రెడ్డి, శివ శంకర్ రెడ్డి, చంద్రశేఖర్ నాయుడు పాల్గొన్నారు.