'పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి'
MHBD: తొర్రూరు ICDS ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో పోషణ పక్వాడ్ వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారిని సబిత పాల్గొని మాట్లాడుతూ... పోషక విలువలున్న ఆహారాన్ని చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందించాలని, అంగన్వాడి కేంద్రాలలో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.