వార్డు సభ్యుల నిరసన

వార్డు సభ్యుల నిరసన

KNR: చిగురుమామిడి (M) ఉల్లంపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం అస్తవ్యస్తంగా సాగుతోందని వార్డు సభ్యులు బుధవారం ఆందోళనకు దిగారు. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేకుండా, నాలుగు రకాల సిమెంట్లతో నాణ్యతలేని పనులు చేస్తున్నారని మండిపడ్డారు. క్యూరింగ్ కూడా చేయడం లేదని, నిబంధనలు తుంగలో తొక్కిన కాంట్రాక్టరుపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.