రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ADB: భీంపూర్ మండలంలోని అర్లి(టీ) 33కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఈనెల 5న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అసిస్టెంట్ ఇంజినీర్ తిరుపతి రెడ్డి శనివారం తెలియజేశారు. ఆర్లి(టీ), నీపని సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని కోరారు.