'ఆసుపత్రికి వచ్చే వారికి శుద్ధ జలాలు అందించాలి'
ASF: ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు, ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆర్.ఓ. ప్లాంట్‌ను పర్యవేక్షకులతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.