టీచర్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ పరిశీలించిన కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి టీచర్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను మంగళవారం సాయంత్రం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా సందర్శించారు. ఉపాధ్యాయులు తయారుచేసిన ఆర్టికల్స్‌ను పరిశీలించి పలు ప్రశ్నలు వేసి సమాచారాన్ని తెలుసుకున్నారు. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా ప్రాక్టికల్స్ ఉండాలని సూచించారు.