కృష్ణానదికి వరద పోటు.. తీరప్రాంత ప్రజలకు ఇబ్బందులు

NGKL: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా కృష్ణానది పరవళ్ళు తొక్కుతోంది. కొల్లాపూర్ నియోజక వర్గం పెంట్లవెల్లి, మంచాలకట్ట, సోమశిల ప్రాంతాల్లో ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఆ కారణంగా ఈ ప్రాంతాల నుంచి నది అవతల ఒడ్డున ఉన్న రాయలసీమలోని నందికొట్కూరు, ఆత్మకూరు ప్రాంతాలకు బొట్లపై వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.