హైవేపై కుక్కల బెడద
VKB: పరిగి మున్సిపాలిటీలోని హైదరాబాద్-బీజాపూర్ 163 నేషనల్ హైవేపై వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రహదారిపై వెళ్లే వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీధుల్లో తిరుగుతూ స్థానికులపై దాడికి పాల్పడుతున్నాయని వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి కుక్కల బెడదను తగ్గించాలని కోరారు.