గజపతినగరంలో బడిబాట కార్యక్రమం

గజపతినగరంలో బడిబాట కార్యక్రమం

VZM: గజపతినగరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.హెచ్. రమేష్ కుమార్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆటో ద్వారా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అనే నినాదంతో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఎంఈఓ విమలమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.