సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆదాయం రూ.9.15 లక్షలు

కృష్ణా: మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి మంగళవారం ఒక్కరోజులో వివిధ సేవల ద్వారా రూ.9,15,853 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.