అడ్మిన్ కార్యదర్శి రాజశేఖర్ సస్పెన్షన్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ ఆదేశాల మేరకు శోధన్ నగర్ వార్డ్ సచివాలయ అడ్మిన్ కార్యదర్శి చీమల రాజశేఖర్‌ను బుధవారం తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. మెడికల్ లీవ్‌లో ఉన్న రాజశేఖర్, విధులకు తిరిగి హాజరుకావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ, ఇప్పటివరకు విధులకు హాజరుకాని కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.