'అనుకోని విపత్తు సంభవిస్తే అప్రమత్తంగా ఉండాలి'

ATP: అనుకోని విపత్తు సంభవిస్తే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి పిలుపునిచ్చారు. బుధవారం అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో ఉన్న రాజహంస అపార్ట్మెంట్‌లో జిల్లా ఫైర్ శాఖ, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. యువకులకి ఎక్కువగా తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు.