బాల్య వివాహాలపై అవగాహన సదస్సు
బాపట్ల మండలం జమ్ములవారిపాలెం జడ్పీ హైస్కూల్‌లో న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు బుధవారం జరిగింది. ప్యానెల్ అడ్వకేట్ దగ్గుమల్లి కిరణ్ కుమార్ విద్యార్థులకు బాల్య వివాహాల నిరోధక, మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలతో ఎన్నో అనర్థాలు వస్తాయన్నారు. అందరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ న్యాయవాది శ్రీనివాసరావు సూచించారు.