విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు వ్యాసరచన పోటీలు
SKLM: రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ బి. శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో ఇవాళ విద్యార్థులకు కాలేజీ లెవెల్ వ్యాస రచన ,డ్రాయింగ్, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పోటీలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.