మంగళగిరిలో మంత్రి ప్రజాదర్బార్‌

మంగళగిరిలో మంత్రి ప్రజాదర్బార్‌

GNTR: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ఇవాళ ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజలు, కార్యకర్తలు లోకేష్‌ను స్వయంగా కలిసి సమస్యలు విన్నవించుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని  భరోసా ఇచ్చారు.