VIDEO: టూ టౌన్ పోలీసుల విస్తృత కార్డెన్ సర్చ్
MBNR: జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ నగర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఆదివారం మహబూబ్‌నగర్ టు టౌన్ పోలీసులు విస్తృతంగా కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతూ.. గుర్తు తెలియని వారికి తమ ఇళ్లను కిరాయికి ఇవ్వకూడదని, వారి ఆధార్ కార్డు తీసుకోవాలని అన్నారు. తనిఖీలలో 27 ద్విచక్ర వాహనాలు 2 ఆటోలు సీజ్ చేసామని తెలిపారు.