కాంగ్రెస్‌ను వీడటం బాధగా ఉంది: జీవన్ రెడ్డి
TG: కాంగ్రెస్‌ను వీడటం బాధగా ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. కానీ, రేవంత్ నిర్ణయాలతో పార్టీ వీడుతున్నానని స్పష్టం చేశారు. జగిత్యాల సభతో హడావిడిగా సీఎం మేడిగడ్డకు వెళ్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం మంచి ప్రాజెక్టు అని, కాళేశ్వరంతోనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. తనపై విమర్శలు చేసే అర్హత సంజయ్‌కి లేదని, ఈ సభతో రాష్ట్ర రాజకీయాలు మారిపోతాయన్నారు.