నేటి నుండి ఇందిరమ్మ చీరల పంపిణీ
SRPT: ఆత్మకూర్(ఎస్ ) మండలంలోని పొదుపు సంఘాల మహిళలకు పంపిణీ చేసేందుకు ఇందిరమ్మ చీరలు వచ్చినట్లు ఏపీఎం రాము శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో మొత్తం 38 సంఘ బంధాలు ఉండగా 1205 పొదుపు సంఘాల గ్రూపులు ఉన్నాయని, ఈ సంఘాల్లో మొత్తం 12,132 మహిళలు ఉండగా పొదుపు సంఘాల మహిళలందరికీ ఒక చీర చొప్పున పొదుపు సంఘాల ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.