ప్రొద్దుటూరులో దారుణ హత్య
KDP: ప్రొద్దుటూరులో ఆదివారం దారుణ ఘటన వెలుగు చూసింది. శ్రీరాంనగర్‌కు చెందిన లక్ష్మీదేవి(50) టీచర్‌గా పనిచేస్తున్నారు. ఏదో విషయమై కుమారుడు యశ్వంత్‌ను ఆమె మందలించింది. ఆగ్రహించిన యశ్వంత్ తల్లిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఈడ్చుకుంటూ ఇంటి బయట వేశాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు యశ్వంత్‌ను అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.