కోడుమూరులో సీపీఐలోకి పలువురి చేరిక
KRNL: కోడుమూరులో సీపీఐలోకి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ఆధ్వర్యంలో పలువురు ఇవాళ చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గిడ్డయ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమాలు చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు శేషు, రాజు, ఏఐఎస్ఎఫ్ నేతలు రంగస్వామి, శ్రీరాములు గౌడ్ పాల్గొన్నారు.