VIDEO: హైవేపై బస్సు, లారీ ఢీ.. ప్రయాణికులు సురక్షితం
KKD: గండేపల్లి జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు, ట్రాలీ లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. హైదరాబాద్ నుంచి ఒడిశా వెళ్తున్న బస్సు మల్లేపల్లి వద్ద మలుపు తీసుకుంటుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. బస్సు అద్దాలు పగిలి పోగా, లారీ ముందు భాగం దెబ్బతింది. ఈ ఘటనలో ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.