ద్వారావతి ఫౌండేషన్ అందరికీ ఆదర్శనీయం: కలెక్టర్

ద్వారావతి ఫౌండేషన్ అందరికీ ఆదర్శనీయం: కలెక్టర్

NTR: ఆకలి కడుపులను నింపి .. మానవ సేవే మాధవ సేవగా తలచి దాతృత్వంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ద్వారావతి ఫౌండేషన్ అందరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఈ సేవాకార్యక్రమంలో పాల్గొన్న ఆయన అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. దాదాపు 200 మంది ఆకలిని తీర్చుతున్న ఈ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని కొనియాడారు.