కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే
KRNL: ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మహిళలకు ఇళ్ల కోసం భూములు కేటాయించలేదని, ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఇవాళ ఆరోపించారు. రూ.3.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.