పిల్లల ఆరోగ్యమే పక్షోత్సవాల లక్ష్యం: కలెక్టర్

పిల్లల ఆరోగ్యమే పక్షోత్సవాల లక్ష్యం: కలెక్టర్

కోనసీమ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 8వ పోషణ పక్వాడ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. గురువారం అమలాపురం కలెక్టరేట్‌లో పోషణ పక్వాడ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ... పిల్లల్లో సెల్‌ ఫోన్, టీవీ వంటి స్క్రీన్‌‌ల వినియోగాన్ని తగ్గించడం ఈ ఏడాది పక్షోత్సవాల ప్రధాన లక్ష్యమని అన్నారు.