అట్టడుగు వర్గాల ప్రజల కోసం పనిచేసిన గొప్ప నాయకుడు

RR: సీపీఎం పార్టీ షాద్ నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో.. పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ డివిజన్ కార్యదర్శి రాజు మాట్లాడుతూ.. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అట్టడుగు వర్గాల ప్రజల కోసం పనిచేసినటువంటి గొప్ప నాయకుడని అన్నారు.