గెడ్డబడి 120వ వార్షికోత్సవం ఘనంగా
AKP: మాడుగుల పట్టణంలో గెడ్డబడి 120వ వార్షికోత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో MPP రాజారామ్ పాల్గొని, ప్రభుత్వ పాఠశాలల్లోనే దేశ మేధావులు చదువుకున్నారని తెలిపారు. బ్రిటిష్ కాలంలో స్థాపితమైన ఈ పాఠశాల అనేక మందిని విద్యావంతులను చేసిందన్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన కోరారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.