డీసీఎం బోల్తా.. డ్రైవర్‌కి గాయాలు
MDK: మనోహరాబాద్ మండలం కూచారం వద్ద 44వ జాతీయ రహదారిపై డీసీఎం బోల్తా పడింది. హైదరాబాద్ వైపు నుంచి తూప్రాన్ వైపు స్క్రాప్ డోర్లు తీసుకువస్తున్న డీసీఎం వాహనం టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. సంఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని ట్రాఫిక్ క్లీయర్ చేశారు.