బొమ్మూరులో భారీగా గంజాయి పట్టివేత

బొమ్మూరులో భారీగా గంజాయి పట్టివేత

E.G: జిల్లాలో భారీగా గంజాయి పట్టబడింది. బొమ్మూరులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి తరలిస్తున్న నలుగుర్ని పట్టుకున్నట్లు తెలిపారు. వారి నుంచి 332 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, దాని విలువు సుమారు రూ. 1 కోటి 70 లక్షలు ఉంటుందన్నారు. నిందితులు కర్నాటకకు చెందిన ఇస్మాయిల్, అలీ ఖాన్, మన్సూర్, సలీంలుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.