ఫొటోగ్రఫీపై ఉచిత శిక్షణ తరగతులు
ELR: పెదపాడు మండలం వట్లూరులో యూనియన్ బ్యాంకు గ్రామీణ ఉపాధి శిక్షణా సంస్థలో ఫొటోగ్రఫీపై ఉచిత శిక్షణ, వసతి భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు శిరోమణి తెలిపారు. మే 11 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకో వచ్చని తెలిపారు. వివరాలకు 9948565256, 9502723561, 9014040780, 9533079471,ఈ నంబర్లను సంప్రదించాలన్నారు.