'గృహ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగు'

'గృహ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగు'

BDK: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈరోజు అశ్వాపురం గ్రామపంచాయతీలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కన్నెబోయిన మంగమ్మ, బెజ్జన బోయిన నాగమణి ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని పేర్కొన్నారు.