పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 13,273 మంది విద్యార్థుల కోసం 60 పరీక్షా కేంద్రాలను కేటాయించారు. 700 మంది ఇన్విజిలేటర్లు, పోలీసు బందోబస్తుతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.