తహశీల్ధార్ కార్యాలయాన్ని ఎమ్మార్పీఎస్ నేతలు ముట్టడి

జగిత్యాల రూరల్ తహశీల్ధార్ కార్యాలయాన్ని సోమవారం ఎమ్మార్పీఎస్ నేతలు ఆసరా పెన్షన్ దారులతో కలిసి ముట్టడించారు. పెన్షన్లను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడకపోతే తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారం, ఉపాధ్యక్షుడు బోనగిరి కిషన్ నేతత్వం వహించారు.