కాణిపాక ఆలయంలో మాక్ డ్రిల్

CTR: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మేరకు పోలీసు, ఆరోగ్య, అగ్నిమాపక శాఖల సిబ్బంది పాల్గొని క్యూలైన్లు, ఇతర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఆర్ ఏఎస్పీ నందకిషోర్, డీఎస్పీ సాయినాథ్, దేవస్థానం అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది తదితరులు హాజరయ్యారు.