శ్రీ భవనారాయణ స్వామి ఆలయ ప్రత్యేకత ఇదే
బాపట్ల జిల్లాలో వెలసిన శ్రీ భవనారాయణ స్వామి ఆలయం తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన ప్రాచీన వైష్ణవి క్షేత్రాలలో ఒకటి. ఇది సుమారు 1500 సంవత్సరాల నాటి ప్రాచీన విష్ణుమూర్తి క్షేత్రం. ఈ ఆలయం 5వ శతాబ్ధంలో చోళ రాజు క్రీమికంఠ చోళుడిచే నిర్మితమైంది. ఇక్కడ పవిత్రోత్సవం, రథోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు.