ట్రాక్టర్-బైక్ ఢీ.. వ్యక్తి మృతి

MHBD: మహబూబాబాద్- తొర్రూర్ రహదారిపై ట్రాక్టర్, బైక్ ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గురువారం నెల్లికుదురు మండలం సంధ్య తండా వద్ద ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తూ.. గడ్డి వాము లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయాడు. ట్రాక్టర్ డబ్బా చక్రంలోకి బైక్ దూసుకెళ్లడంతో అతడి తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు.