ఐటీడీఏ గ్రీవెన్స్‌కు 19 వినతులు
PPM: సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో ఏపీవో చిన్నబాబు ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలోని గ్రామాల ప్రజలు పలు సమస్యలు తెలుపుతూ గ్రీవెన్స్‌కు 19 వినతులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. గ్రీవెన్స్‌కు వచ్చిన వినతులకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యలు పరిష్కరించాలని ఏపీవో అధికారులకు సూచించారు.