గ్రామాలలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించండి

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని స్థానిక సీఐ కార్యాలయంలో మంగళవారం హనుమంతునిపాడు, పెద్ద చెర్లోపల్లి, కనిగిరి ఎస్సైలతో సీఐ ఖాజావలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులు వివరాలు తెలుసుకున్నారు. మండలాల్లో పల్లె నిద్ర నిర్వహించి గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు.