జిల్లాలోని 16 కేంద్రాల్లో నీట్ పరీక్ష

కర్నూలులోని 16 పరీక్ష కేంద్రాల్లో ఈ నెల 4న నీట్ పరీక్ష జరగనుంది. 4,466 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనమతిస్తామని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించమని చెప్పారు.