పెనుకొండ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రికి వినతి
సత్యసాయి: పెనుకొండ నగర పంచాయతీ అభివృద్ధికి రూ. 10 కోట్లు నిధులు మంజూరు చేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను పెనుకొండ టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీరాములు కోరారు. ఆయన మాట్లాడుతూ.. పెనుకొండ నగర పంచాయతీలో రహదారులు, డ్రైనేజీ, నీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల లోపాలు తీర్చడం కోసం నిధులు అవసరమని మంత్రికి వివరించారు. అనంతరం వినతి పత్రం అందజేశారు.