పాము కాటుకు గురై మహిళ మృతి

పాము కాటుకు గురై మహిళ మృతి

NLG: పాముకాటుకు గురై ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోడిరెక్క జ్యోతి ఇవాళ ఉదయం పాముకాటుకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. జ్యోతి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.