విద్యార్థినితో అనుచిత ప్రవర్తన.. టిచర్ సస్పెండ్

కృష్ణా: చదువు కోసం వచ్చిన ఓ విద్యార్థిని వేదనకు గురైంది. గుడ్లవల్లేరు డైట్ కాలేజీలో డిప్యూటేషన్‌పై బోధన చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు హరి కిరణ్ ఆమెను 20 రోజులుగా వేధిస్తున్నాడని, అసభ్య సందేశాలు, ఫోన్ కాల్స్‌తో మానసికంగా కుంగిపోయిన ఆమె చివరకు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది. విషయాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి హరికిరణ్‌ను సస్పెండ్ చేశారు.