విదేశీ ఉద్యోగం పేరుతో మోసం.. పోలీసులకు ఫిర్యాదు
PLD: దుర్గి మండలం ముటుకూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి విదేశీ ఉద్యోగం పేరుతో మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. క్రోసూరుకి చెందిన ఓ వ్యక్తి UK పంపిస్తానని చెప్పి మధ్యవర్తి ద్వారా రూ. 20 లక్షలు తీసుకున్నట్లు బాధితుడు తెలిపాడు. డబ్బు తీసుకున్న తర్వాత ఆరు సంవత్సరాలు గడిచినా పూర్తిగా తిరిగి ఇవ్వలేదని వాపోయాడు. దీంతో న్యాయం చేయాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.