మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
HNK: శాయంపేట మండల కేంద్రంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. రైతులు మధ్యవర్తుల వద్ద తమ పంటను అమ్ముకోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరను పొందాలని, రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే అన్నారు.